లాక్డౌన్ వల్ల విధి నిర్వహణలో విరామం లేకుండా కష్టపడుతున్న పోలీసులకు పరిగి మాజీ జెడ్పీటీసీ చంద్రయ్య సరకులు పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు ఉద్యోగులకు నిత్యావసరాలు అందించారు.
గత 50 రోజులుగా నిద్రాహారాలు మాని, ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. మానవతా దృక్పథంతో తమకు తోచిన సహాయం చేయాలని ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: అష్టదిగ్బంధంలో జియాగూడ..!