BRS President KCR Public Meeting at Suryapet : కాంగ్రెస్ పాలనలో మూసీ ప్రాజెక్టు(Musi Project)ను నాశనం చేశారని.. సూర్యాపేటలో ఏళ్ల తరబడి మురికి నీళ్లు ఇచ్చారని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెన్ పహాడ్ కాలువలో ఏడాదంతా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting)లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు
రైతులకు 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. మరి మూడు గంటల విద్యుత్ ఇస్తే పొలానికి సరిపడా నీళ్లు పారుతాయా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అలాగే రైతులు 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయని.. ఈ అన్ని పంపు సెట్లకు కలిపి రూ.30 వేల కోట్లు కావాలని చెప్పారు. అయితే ఈ మోటారు పంపు సెట్లకు డబ్బులు ఎవరు ఇవ్వాలని సభలో ఉన్న ప్రజలను ప్రశ్నించారు.
BRS Praja Ashirvada Sabha at Suryapet : కాంగ్రెస్ పాలనలో సూర్యాపేటకు ఏళ్ల తరబడి మురికి నీళ్లు ఇచ్చారని.. లక్షన్నర మంది ఫ్లోరైడ్(Fluoride) బారిన పడిన వారు ఉన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం వ్యవసాయానికి మీటర్ పెట్టాలని షరతు విధించిన విషయాన్ని తెలిపారు. సాగుకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించకపోతే నిధుల్లో కోత పెడతామని హెచ్చరించి.. రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రూ.25 వేల కోట్లు కోత పెట్టారని ఆరోపించారు. అప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం మీటర్లు పెట్టకపోవడం వల్లే కోతపెట్టినట్లు చెప్పారని అన్నారు.
ఇవాళ రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందని.. ఈ ధాన్యాన్ని 7500 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. రైతు బంధు(Rythu Bandhu) దుబారా అని ఆరోపణలు చేస్తున్నారని.. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ వాళ్లు సవాల్ విసురుతున్నారని మండిపడ్డారు. ధరణి పేరుతో ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాన్ని రైతుల చేతిలో పెట్టామన్నారు. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 4 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని.. అప్పుడు దేశానికే అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR Comments on Congress Party : దేశంలో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం ఉందని.. ఇప్పటి వరకు ఒక్క వైద్య కళాశాల, నవోదయ పాఠశాల కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. ఒక్క విద్యా సంస్థ ఇవ్వని పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో జగదీశ్‌రెడ్డిని గెలిపిస్తే డ్రై పోర్టు(Dry Port) ఇప్పించే బాధ్యత తనదని కేసీఆర్ హామీ ఇచ్చారు.
చిన్న పార్టీలు, స్వతంత్రులకు రోడ్డు రోలర్, చపాతీ కర్ర గుర్తుల కేటాయింపు - బీఆర్ఎస్ నేతల్లో గుబులు