హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టడం చూస్తే... తెలంగాణ సమాజం ఎప్పుడూ సీఎం కేసీఆర్ వెంటే ఉందని మరోసారి తేటతెల్లమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ విషయం పదే పదే రుజువవుతున్నా... విపక్షాలు తమ వికృతచేష్టలు మానుకోవడం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వం, కేసీఆర్‌పై అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల దృష్టి మరల్చి లాభపడాలనుకున్న విపక్ష నేతల ప్రయత్నాలకు... ప్రజలు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: హుజూర్‌నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి