ETV Bharat / state

గోదావరి జలాలకు జలహారతిచ్చిన హరీశ్​రావు - సిద్ధిపేట జిల్లా వార్తలు

ఊర చెరువు నిండి మత్తడి దూకుతున్న గోదావరి జలాలను జలహారతి పట్టి మంత్రి హరీశ్​ రావు ఆహ్వానించారు. సిద్ధిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం బద్దిపడగ గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఎన్నో ఏండ్ల కల నెరవేర్చి చెరువులోకి నీళ్లు తెచ్చి మొదటిసారి గ్రామానికి వచ్చిన మంత్రిని గ్రామస్థులు ఎడ్లబండిపై ఊరచెరువు వరకు ఘనంగా ఊరేగించారు.

Minister Harish Rao Harathi for Godavari Water
గోదావరి జలాలకు జలహారతిచ్చిన మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Jun 1, 2020, 3:17 PM IST

సిద్ధిపేట నియోజకవర్గంలోని బద్ధిపడగ గ్రామంలో గోదావరి జలాలను ఆహ్వానిస్తూ మంత్రి హరీశ్​ రావు జలహారతి పట్టి ఆహ్వానించారు. రంగనాయక సాగర్ నుంచి బద్ధిపడగ గ్రామంలోని ఊరచెరువును గోదావరి జలాలతో నింపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బద్ధిపడగ గ్రామంలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నియంత్రిత సాగువిధానంపై గ్రామ రైతులకు అవగాహన సదస్సు జరిగింది. మంత్రి హరీశ్​రావు ఆధ్వర్యంలో గ్రామ రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రాధాన్య పంటలే వేస్తామని తీర్మానం చేసి.. మంత్రికి అందించారు. పదవులు శాశ్వతం కాదని.. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన మీ అభిమానం, ప్రేమ శాశ్వతమని మంత్రి అన్నారు. 'మీ అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా మార్చుకుందాం. వ్యవసాయంలో కొన్ని మార్పులు తెస్తున్నాం. నియంత్రణ అంటే.. ప్రాధాన్య పంటల సాగు. సీఎం కేసీఆర్ కల రైతు ఆదాయం పెరగడం, ఆర్థికంగా రైతు బలోపేతం కావడం.. అది ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు.. అందరి కృషి వల్లే రైతు రాజవుతాడు.' అని మంత్రి అన్నారు.

యాసంగిలో మంచి బలువైన, బర్కత్ ఉన్న పంట పండుతుంది. వానాకాలం బదులు యాసంగిలో మొక్కజొన్న వేయాలని రైతులకు సూచిస్తున్నాం. వరిలో సన్న రకం పండించాలని, సన్న రకంలో తెలంగాణ సోనా బియ్యం పండించాలని, ఈ తెలంగాణ సోనా బియ్యం షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు కూడా తినొచ్చని, దిగుబడి కూడా అధికంగా వస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ సోనా సన్నరకం 4 నెలల పంట. ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని రైతులకు మంత్రి అవగాహన కల్పించారు. ప్రతి రైతు తాను పండించే పంట వివరాలను మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని రైతులకు మంత్రి సూచన చేశారు.

ఈ ఏడాది ప్రతిరైతుకు రైతుబంధు, పెట్టుబడి సాయం, కరెంటు, కాళేశ్వరం నీళ్లు, నాణ్యమైన విత్తనాలు, ప్రభుత్వం నుంచి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని.. పొలం దగ్గరికి నీళ్లు రావాలంటే.. కాల్వల కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. మల్బరీ సాగులో రాష్ట్రంలోనే సిద్ధిపేట నియోజకవర్గం ఆదర్శంగా మొదటి స్థానంలో నిలిచింది. బద్ధిపడగ గ్రామ రైతులు మిర్చి, మల్బరీ, స్వీట్ కార్న్ తదితర అధిక ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని రైతులకు మంత్రి సూచించారు. కరోనా విషయంలో అజాగ్రత్త వద్దు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి.. జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముంబయి, షోలాపూర్ నుంచి వచ్చే వారితో జిల్లాలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా వైరస్ దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముంబయి నుంచి వచ్చిన వారిని 15 రోజులు క్వారంటైన్​లో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.