సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం కాసులబాద్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మరణించింది. గురువారం గ్రామస్థులు వ్యవసాయ పనుల నిమిత్తం అటవీ ప్రాంతం వైపు వెళ్లగా మృతి చెందిన చిరుతపులి కనిపించింది. వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న అధికారులు చిరుతపులి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రపంచదేశాలకు 1 ట్రిలియన్ డాలర్ల రుణం: ఐఎంఎఫ్