ETV Bharat / business

ప్రపంచదేశాలకు 1 ట్రిలియన్​ డాలర్ల రుణం: ఐఎంఎఫ్​ - global GDP

ప్రపంచదేశాలను కరోనా కకావికలం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్​తో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు మద్దతుగా 1 ట్రిలియన్​ డాలర్లతో పూర్తిస్థాయిలో రుణ సౌకర్యాన్ని కల్పించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్​) సంస్థ యోచిస్తున్నట్లు డైరెక్టర్​ జనరల్​ క్రిస్టాలినా జార్జివా తెలిపారు.

IMF proposes to deploy full USD 1 trillion lending capacity to support countries battling COVID-19
ప్రపంచదేశాలకు 1 ట్రిలియన్​డాలర్లు రుణ సాయం: ఐఎంఎఫ్​
author img

By

Published : Apr 16, 2020, 11:36 AM IST

మహ్మమారితో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేయనునట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్​) సంస్థ డైరెక్టర్ జనరల్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు మద్దతుగా 1 ట్రిలియన్​ డాలర్లతో రుణ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. వైరస్​ను ఎదుర్కోవడానికి.. 189 ఐఎంఎఫ్ సభ్యదేశాల్లో 102 దేశాలు రుణ సహాయాన్ని​ అర్థిస్తున్నట్లు క్రిస్టాలినా చెప్పారు.

"మహా మాంద్యం తర్వాత ఎన్నడు లేనివిధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం. ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 3 శాతం క్షీణించనుంది. 170 దేశాల్లో తలసరి ఆదాయం భారీగా తగ్గిపోనుంది. మూడు నెలల క్రితం ఊహించిన దాని కంటే ఇది అధికం." - క్రిస్టాలినా జార్జివా, ఐఎంఎఫ్​ డైరెక్టర్​ జనరల్

ఒక్కనెల వ్యవధిలోనే..

తొలుత 50 బిలియన్​ డాలర్లు రుణ సాయం చేయాలనుకున్నట్లు ఐఎంఎఫ్​ తెలిపింది. అయితే ఒక్క నెల వ్యవధిలోనే మారిన పరిస్థితులను దృష్ట్యా 100 బిలియన్​ డాలర్ల సహాయం అందించాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే 15 దేశాలకు రుణ సాయం చేసింది. మరో 25 పేదదేశాలకు రుణాన్ని ఇవ్వడానికి అమోదం తెలిపినట్లు స్పష్టం చేసింది. 30 దేశాలకు పైగా అత్యవసర రుణం కోసం అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: సార్వత్రిక పోరులో మూన్​ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.