సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం జేపీ తండాలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పది లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనం ప్రహారీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ట్యూషన్ - అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు మంచినీళ్ల సీసాలు, పళ్లాలు పంపిణీ చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వ్యవసాయ భూములున్న వారికి పాడిపశువులు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నంగునూరు మండలంలో పదోతరగతి పరీక్షలో నూరు శాతం ఉతీర్ణత సాధించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురమ్మని సూచించారు.
ఇదీ చూడండి: 'మృతదేహాన్ని మేము తీసుకోం'