సిద్ధిపేట జిల్లాలో కాళేశ్వరం జలాలు కాలువల ద్వారా చెరువులు, కుంటల్లో చేరుతుంటే రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి(అన్నపూర్ణ) జలాశయం ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల చేయగా కల్లెపల్లి శివారులోని ఎక్కం చెరువులోకి చేరగా పూజలు చేశారు.
కల్లెపల్లి, బెజ్జంకి గ్రామాల్లోని చెరువుల్లోకి జలాలు చేరడం వల్ల పలుచోట్ల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. లాక్ డౌన్ కారణంగా గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: అష్టదిగ్బంధంలో జియాగూడ..!