సిద్దిపేట జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణిలో 82 దరఖాస్తులు వచ్చాయని పాలనాధికారి కార్యాలయం తెలిపింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
అనంతరం ఆయా విభాగాల అధికారులకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్‌తో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : పోషకాహార పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలు