సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బస్ డిపో నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అప్పటికే అక్కడ వేచిచూస్తున్న పోలీసులు లోపలికి వెళ్లకుండా కార్మికులను అడ్డుకున్నారు. కార్మికులకు, తెరాస నాయకులకు వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని శాంతింపజేశారు. ఆర్టీసీని కాపాడేందుకు ఎన్నిరోజులైనా సమ్మె చేపడతామని కార్మికులు తెలిపారు.
ఇవీచూడండి: మానవ తప్పిదం వల్లే ప్రమాదం..!