రైతు సమస్యలపై వ్యవసాయ అధికారి ఆరా పటాన్చెరు మండలం పోచారం, బచ్చుగూడెం గ్రామాల్లో సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు పర్యటించారు. రైతులతో కలిసి క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. వ్యవసాయ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతునేస్తం కార్యక్రమంలో ప్రతిరోజు 25 మంది అన్నదాతలను కలిసి వారి సమస్యలు తెలుసుకోడం అధికారుల బాధ్యతన్నారు.
వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు రైతులకు అందేలా చర్యలు తీసకుంటామని నరసింహారావు హామీ ఇచ్చారు. పంట పండించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి: 'మా వాడ ముద్దు.. వైన్స్ షాప్ వద్దు'