మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిసరాలు శుభ్రం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఎమ్మెల్యే నివాసంలో గ్రేటర్ ఉప కమిషనర్ బాలయ్య ఆధ్వర్యంలో దోమల నివారణ చేపట్టారు. దోమల వ్యాప్తిని అరికట్టే విధంగా ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రతి ఆదివారం శుభ్రత కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. పరిసరాల పరిశుభ్రత వల్లే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని తెలిపారు.