ETV Bharat / state

కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ - kadiyam Foundation

కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
author img

By

Published : May 10, 2020, 12:10 AM IST

జనగామ జిల్లా లింగాల ఘన్​పూర్​లో 85 మంది ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కిరాణా సరుకులు పంచారు. కరోనా నియంత్రణకు ఆశా వర్కర్లు ఆశాకిరణాలుగా వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. వైద్య సిబ్బందికి తోడు ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు.

ఫలితంగా కరోనా విస్తరణను ప్రాథమిక దశలోనే ఎదుర్కోగలిగామని పేర్కొన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య వివరాల సేకరణే కాకుండా అప్రమత్తంగా ఉండాలని వారికి సూచనలు చేశారని అన్నారు. సుమారు వెయ్యికి పైగా కుటుంబాలకు సరుకులు పంపిణి చేశామన్నారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​లోనూ రోడ్లపైకి భారీగా వాహనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.