ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన పెయింటర్ సంగారెడ్డి శివారులోని మహబూబ్‌సాగర్ చెరువులో ప్రమాదవశాత్తు పడి రాజు(28) అనే వ్యక్తి మృతి చెందాడు. పఠాన్ చెరు మండలం లక్డారాం గ్రామానికి చెందిన రాజు వృత్తి రీత్యా పెయింటర్. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం పెయింటింగ్ పని కోసం సంగారెడ్డికి వచ్చిన రాజు చెరువులో పడి విగత జీవిగా మారాడు. రాజుకు ఫిట్స్ వ్యాధి ఉన్నట్లు సమీప బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇవీ చూడండి :హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు