సంగారెడ్డి జిల్లా కోహీర్ తహసీల్దార్ కార్యాలయానికి పాస్ పుస్తకం కోసం వచ్చిన రైతు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. మనియార్‌పల్లి తండాకు చెందిన 50ఏళ్ల తుల్జానాయక్ భూమికి సంబంధించిన పట్టాదారు పుస్తకం కోసం కొన్నాళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. బుధవారం వచ్చి అధికారులతో పాసు పుస్తకం వివరాలు మాట్లాడుతూనే హఠాన్మరణం చెందాడు. భూమి దక్కదన్న ఆందోళనతోనే కుప్పకూలి మృతిచెందాడని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి : విధానపరమైన నిర్ణయాల్లో జోక్యమేలా..?