ETV Bharat / state

రూ.కోట్ల విలువైన చెరువు భూముల ఆక్రమణ

కబ్జా కోరల్లో చెరువులు చిక్కుకున్నాయి. రూ.కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. పలువురు స్థిరాస్తి వ్యాపారులు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి... చెరువులను పూడ్చి కొన్నింటిలో లే అవుట్లు, గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్​ పరిధిలో గతేడాది కురిసిన వర్షాలకు పలుచోట్ల చెరువులు కబ్జాలకు గురికావడం వల్ల పలు కాలనీలు నీటమునిగాయి. ఒక్క శంషాబాద్​ మండలంలోనే ఏడాదిన్నర కాలంలో 30 చెరువులు కబ్జా చేశారు. ఆక్రమణలదారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Occupancy of pond land, crores worth lands Occupied
చెరువుల కబ్జా, హైదరాబాద్​లో చెరువుల కబ్జా, శంషాబాద్​లో చెరువుల కబ్జా
author img

By

Published : Jun 25, 2021, 9:08 AM IST

బ్జాదారులకు హైదరాబాద్​ నగర శివారుల్లోని చెరువులు సిరులు కురిపిస్తున్నాయి. రెవెన్యూ, సాగునీటి అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని కొన్ని స్థిరాస్తి వెంచర్లుగా మారిపోతుండగా... మరికొన్నింటిలో గిడ్డంగులు వెలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పేరు చెప్పి, అధికారులను బెదిరించి మరీ పూడ్చి వేస్తున్నారు. శంషాబాద్‌ మండలంలో ఏడాదిన్నర కాలంలో 30 చెరువులు పూర్తిగా అంతర్థానమవగా, మరో అయిదారింటిలో 30 ఎకరాల భూమిని చెరపట్టారు. ఒక చెరువులో లే అవుట్‌ వేసి అమ్మేశారు.

బాహ్యవలయ రహదారి(ORR)కి ఆనుకొని ఉన్న చెరువుల సమీపంలోని భూముల ధరలు రూ.కోట్లు పలుకుతున్నాయి. కొందరు కబ్జాదారులు, స్థిరాస్తి వ్యాపారుల కళ్లు వాటిపై పడ్డాయి. జీవో నం.111 ప్రకారం చెరువు భూముల్లో నిర్మాణాలకు అనుమతులివ్వరు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌టీఎల్‌లోఉన్న భూములను పూడ్చి లే అవుట్లు, కల్యాణ మండపాలు, గిడ్డంగులు, కోళ్ల ఫారాలను నిర్మిస్తున్నారు. జలవనరులపై ఆధారపడిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బైరమోని కుంటలో వెలిసిన వెంచర్లు, షెడ్లు

పెద్దగోల్కొండ బైరమోని చెరువు: పెద్దగోల్కొండలో ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని 14 ఎకరాల్లో బైరమోని చెరువు విస్తరించింది. గతేడాది ఓ కబ్జాదారుడు కన్నేసి, మట్టితో పూడ్పించాడు. ఆనవాళ్లు లేకుండా చేసి, స్థిరాస్తి వెంచర్‌ వేసి, రూ.కోట్లకు అమ్ముకున్నాడు. స్థానికులు పలుమార్లు రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు మొదలయ్యాయి. పట్టా భూమని కొందరు వాదిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టా భూమిలో చెరువుంటే వ్యవసాయం చేసుకోవచ్చు కానీ నిర్మాణాలు చేపట్టరాదు.

శంషాబాద్‌ మండలంలో 30 కనుమరుగు
శంషాబాద్‌ మండలంలోని 40 గ్రామాల్లో భూగర్భ జలాల పరిరక్షణకు కాకతీయులు, నిజాం పాలకులు 90కి పైగా చెరువులు, కుంటలను నిర్మించారు. అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై 30 చెరువులను మాయం చేశారు. మిషన్‌ కాకతీయలో భాగంగా రూ.2 కోట్లు వెచ్చించి 55 జలవనరులను నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల పునరుద్ధరించారు. ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని హమీదుల్లానగర్‌, సంఘీగూడ, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ గ్రామాల్లోని చెరువులనూ కబ్జాదారులు చెరబట్టారు.

దేవుని చెరువు: ఓఆర్‌ఆర్‌ ఆనుకొని హమీదుల్లానగర్‌లో 9 ఎకరాల్లో విస్తరించిన దేవుని చెరువు గిడ్డంగులు, కోళ్ల ఫారాలకు అడ్డాగా మారింది. దీనికి ఆనుకొని ఉన్న పట్టా భూములను ఓ వ్యాపారి కొనుగోలు చేశారు. నాలుగైదు ఎకరాల ఆక్రమించి మట్టితో పూడ్చివేస్తున్నారు. అనుమతుల్లేకుండానే గిడ్డంగులు నిర్మిస్తున్నారు. చనిపోయిన కోళ్లను, చెడిపోయిన కోడి గుడ్లను, రసాయన వ్యర్థ్యాలను నిబంధనలకు విరుద్ధంగా చెరువు నీటిలో పారబోస్తుండటంతో కలుషితమవుతోంది. అధికారులు నోటీసులు జారీ చేసినా వినకుండా, ఓ ఎంపీ మా బంధువంటూ ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలను కొనసాగిస్తున్నారు.

ఈ మూడింటిదీ అదే పరిస్థితి: ఇదే మండలంలో 9 ఎకరాల్లో నరసింహ చెరువు, 15 ఎకరాల్లో బూరుకుంట చెరువు, 40 ఎకరాల్లో ఎర్ర చెరువు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ భూముల విలువ రూ.కోట్లలో పలుకుతోంది. మూడు చెరువుల్లోని సుమారు 16 ఎకరాలను ఇప్పటికే కొందరు కబ్జాదారులు ఆక్రమించేశారు. అయినా రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఆక్రమణదారులతో కొందరు అధికారులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి.

నోటీసులు జారీ చేశాం

ఓఆర్‌ఆర్‌ను అనుకొని చెరువులు అన్యాక్రాంతమవుతున్న మాట వాస్తవమే. హమీదుల్లానగర్‌, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ గ్రామాల చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసినా మొండిగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమిత భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకుంటాం. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం.

జగదీశ్‌, నీటి పారుదల శాఖ డీఈ

ఇదీ చూడండి: నేటితో పూర్తి కానున్న వానాకాలం రైతుబంధు సాయం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.