ETV Bharat / state

కరోనా నివారణకు మంత్రి సబితా అత్యవసర సమీక్ష - MINISTER SABITHA EMERGENCY MEETING IN JALPALLY MUNICIPALITY ON CORONA IN RANGAREDDY DISTRICT

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపల్ కార్యాలయంలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి సబితా అత్యవసరంగా సమీక్షించారు. వైరస్​ నివారణకు తీసుకోవాల్సిన చర్యలను గురించి స్థానికులకు వివరించారు.

కరోనా కేసుల నేపథ్యంలో మంత్రి సమీక్ష
కరోనా కేసుల నేపథ్యంలో మంత్రి సమీక్ష
author img

By

Published : Apr 7, 2020, 7:12 AM IST

Updated : Apr 7, 2020, 8:18 AM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలుపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుర కార్యాలయంలో చర్చించారు. కందుకూరు డివిజన్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, జల్​పల్లి మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లా, బాలాపూర్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, వైద్య శాఖ అధికారులతో అత్యసర సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం షాహీన్ నగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో కలిసి వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కరోనా నివారణకు మంత్రి సబితా అత్యవసర సమీక్ష

ఇవీ చూడండి : రాష్ట్రంలో విస్తరిస్తోన్న కరోనా.. 364 కేసులు నమోదు

Last Updated : Apr 7, 2020, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.