శుక్రవారం ఒక్కరోజే 140 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేశారు. కేవలం 30 మంచాలు మాత్రమే అందుబాటులో ఉండగా... అవీ ఇద్దరి, ముగ్గురు చొప్పున 60 మందికి కేటాయించారు. మిగతావారిని నేలపైనే పడుకోబెట్టారు. నొప్పి భరించలేక బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని, సరైన ఏర్పాట్లు చేసుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.