రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్ సిరినగర్ కాలనీలో రోజువారీ కూలీలకు కాంగ్రెస్ శ్రేణులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరంలోని పార్టీ శ్రేణుల సహకారంతో 75 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.
కాంగ్రెస్ నేతలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి నిత్యావసర సరకులు, బియ్యం, గోధుమ పిండి, వంటనూనె, కందిపప్పును పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత ధనరాజ్ గౌడ్, తల్లాటి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట