వ్యవసాయ మార్కెట్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకరోత్సవం ఘనంగా జరిగింది. కమిటీ ఛైర్మన్‌గా కవ్వంపల్లి లక్ష్మీ... ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు సకాలంలో సేవలు అందించాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు ఆకాంక్షించారు. జానపద గేయాన్ని ఆలపించి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:కడు పేదరికంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత!