KTR Comments on GST: రాష్ట్రంలోని నేతన్నలపై కేంద్రం జీఎస్టీ పేరుతో భారం మోపుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేత క్లస్టర్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. జీఎస్టీ పెంచి వస్త్ర పరిశ్రమను దెబ్బతీసే ప్రయత్నం కేంద్రం చేస్తుందని ఆరోపించిన కేటీఆర్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా నిర్ణయాన్ని వాయిదా వేశారని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.....నేతన్న సమస్యలపై పోరాడాలని కోరారు.
నేతన్నకు అండగా ఉంటాం..
"వస్త్రపరిశ్రమపై జీఎస్టీని పెంచి నేతన్నను దెబ్బతీసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికైతే.. తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది కానీ.. మొత్తానికి విరమించుకోలేదు. నా అనుమానం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అక్కడున్న నేతన్నల ఓట్లు పడవేమోనని భయపడి జీఎస్టీ నిర్ణయాన్ని వాయిదా వేశారనిపిస్తోంది. నేతన్నల సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేతన్నకు, వస్త్ర పరిశ్రమకు కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది."
- కేసీఆర్, మంత్రి
ఇదీ చూడండి: