పెద్దపల్లి జిల్లా పార్వతి బ్యారేజీ వద్ద మత్స్యకారులు ప్రమాదకర స్థితిలో చేపల వేట సాగిస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బ్యారేజీ గేట్లు తెరిస్తే వారు కొట్టుపోయే ప్రమాదం ఉంది.
స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. బ్యారేజీ వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా మంథని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారేజ్ వద్ద ఇరు వైపులా ఎవరినీ వెళ్లనీయడం లేదు.
ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'