కరీంనగర్-పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం వరద ఉద్ధృతికి తెగిపోయింది. దాదాపు 13 కోట్ల 50 లక్షల రూపాయలతో 850 మీటర్ల నిడివిలో నిర్మించారు. కానీ నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం వల్ల కేవలం రెండేళ్లలో పేకముక్కల్లా నీళ్లలో కొట్టుకుపోయింది.
చెక్‌డ్యాంకు పక్కనే ఉన్న పంట పొలాలన్నీ కోతకు గురయ్యాయి. వాగులో ఏర్పాటు చేసుకున్న మోటార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. వరిపొలాల్లో ఇప్పటికీ ఇసుక మేటలే దర్శనమిస్తున్నాయి. నిర్మాణంలో ఉండగా కొట్టుకు పోయిన దృష్ట్యా గుత్తేదారు నిర్మిస్తాడని అధికారులు చెబుతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని అధికారులేవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి : పంటను కాపాడుకునేందుకు ప్రత్యేక యంత్రం