Body Detoxification Home Remedies: మన శరీరంలోని మలినాలు, వ్యర్థాలు తొలగించడం వల్ల మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడంతో జీర్ణక్రియ పనితీరు మెరుగు పడుతుందని వివరించారు. కానీ, శరీరంలోని వ్యర్థాలు, మలినాలు తొలగించడానికి చాలా సమయం పడుతుందని, కష్టమైనదని భావిస్తుంటారు. కానీ ప్రతిరోజూ ఉదయం ఈ 5పనులు చేస్తే మీ శరీరం క్లీన్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయిల్ పుల్లింగ్: శరీరాన్ని ముఖ్యంగా నోటిలోని మలినాలు శుభ్రం చేయడానికి పురాతన ఆయుర్వేద ప్రక్రియ ఆయిల్ పుల్లింగ్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ విషయం International Journal of Health Sciencesలో ప్రచురితమైంది. ప్రతి రోజు ఓ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 10-15 నిమిషాల పాటు పుకిలించడం వల్ల హానీకారక బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుందని వివరించారు. ఉదయం 7 గంటలకు చేయడం వల్ల రాత్రి నుంచి నోటిలో పేరుకుపోయిన మలినాలను ఇది తొలగిస్తుందన్నారు. ఫలితంగా తాజా శ్వాసతో పాటు దంతాలు క్లీన్‌గా మారతాయని పేర్కొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి: ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలు తొలగిపోయి.. రిలాక్స్‌గా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకా శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడి.. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని వివరించారు. ఇందులో కొన్ని యూకలిప్టస్, ల్యావెండర్ లాంటి నూనె చుక్కలు వేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని అంటున్నారు.
అల్లం, నిమ్మరసం తాగండి: ప్రతిరోజు ఉదయాన్నే ఓ గ్లాసు గోరువెచ్చటి నీటిలో అల్లం, నిమ్మరసం వేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మలో పుష్కలంగా ఉండే విటమిన్ సీ.. శరీరంలో పీహెచ్ స్థాయులు అదుపులో ఉండేలా చేస్తుందన్నారు. శరీరంలోని మలినాలు తొలగించే సహజ డీటాక్సీఫైర్గానూ పనిచేస్తుందని వివరించారు. ఇంకా అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు.. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందన్నారు.
యోగా: ప్రతిరోజూ ఉదయాన్నే ప్రాణాయాణం లాంటి బాగా ఊపిరి తీసుకునే యోగా ప్రక్రియలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఊపిరితిత్తులోని మలినాలను తొలగించి.. ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపారు. ఇంకా రక్తంలో ఆక్సిజన్ స్థాయులను పెంచుతుందని వివరించారు. నాలుగు సెకన్లు బాగా ఊపిరి పీల్చుకుని.. 7 సెకన్ల పాటు ఊపిరిని బిగపట్టుకుని ఆ తర్వాత 8 సెకన్ల పాటు బయటకు వదలాలట.
వాకింగ్: వాకింగ్ చేస్తూ స్వఛ్చమైన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థాలు సహజంగానే బయటకు వెళ్లిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇది రక్త సరఫరాను, జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుతుందని చెబుతున్నారు. ఇంకా ఉదయాన్నే ఎండలో తిరగడం వల్ల విటమిన్ డీ సైతం అందుతుందని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఉదయాన్నే తేనె-నిమ్మరసం కలిపి తాగుతున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
చెమట పట్టకుండా, ఇంచు కదలకుండానే వ్యాయామం బెన్ఫిట్స్- "ఎక్సర్సైజ్ ట్యాబ్లెట్" రెడీ చేసిన పరిశోధకులు