ETV Bharat / state

ఐటీబీపీలో 526 పోలీస్ జాబ్స్​ - ఈ అర్హతలు, ప్రిపరేషన్ ఉంటే కొలువు మీదే!

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్సు రిక్రూట్​మెంట్​​ 2024 - 526 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

itbp si constable Notification
ITBP Recruitment 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

ITBP SI, Constable & Head Constable Vacancy 2024 : ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్సు నుంచి ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వెలువడింది. 526 సబ్‌-ఇన్‌స్పెక్టర్, హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రకటించినవాటిలో గ్రూప్‌-బీ, నాన్‌-గెజిటెడ్‌ (నాన్‌ - మినిస్టీరియల్‌) కేటగిరిలో ఎస్సై, గ్రూప్‌-సీ, నాన్‌-గెజిటెడ్‌ (నాన్‌- మినిస్టీరియల్‌) విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ ఉద్యోగ అవకాశాలున్నాయి.

ఎస్సై (టెలికమ్యూనికేషన్‌) 92 ఖాళీల్లో పురుషులకు 78, మహిళలకు 14; హెడ్‌ - కానిస్టేబుల్‌ (టెలికమ్యూనికేషన్‌) 383 ఖాళీల్లో పురుషులకు 325, మహిళలకు 58; కానిస్టేబుల్‌ (టెలికమ్యూనికేషన్‌) 51 ఖాళీల్లో పురుషులకు 44, మహిళలకు 7 పోస్టులు కేటాయించారు. ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలో ఇప్పుడు చూద్దాం.

1. సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (టెలికమ్యూనికేషన్‌) : డిగ్రీలో బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌. లేదా

  • బీసీఏ/ బీఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్) / ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.

2. హెడ్‌-కానిస్టేబుల్‌ (టెలి కమ్యూనికేషన్‌) : కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా పదో తరగతి పాసై రెండేళ్ల ఐటీఐ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌/ కంప్యూటర్‌) సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. లేదా పదవ తరగతి ఉత్తీర్ణతై, మూడేళ్ల డిప్లొమా కోర్సు (ఎలక్ట్రానిక్స్‌/ కమ్యూనికేషన్‌/ ఐటీ/ ఎలక్ట్రికల్‌) ఉండాలి.

3. కానిస్టేబుల్‌ (టెలి కమ్యూనికేషన్‌) : మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష, ఐటీఐ (డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు) కంప్లీట్​ చేయాలి.

వయసు : ఎస్సై (టెలి కమ్యూనికేషన్‌) పోస్టుకు 20-25 సంవత్సరాలు, హెడ్‌-కానిస్టేబుల్‌ పోస్టుకు 18-25 ఏళ్లు, కానిస్టేబుల్‌ పోస్టుకు 18-23 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, మాజీ సైనికోద్యోగులకు కేటగిరీని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్లు, ప్రభుత్వోద్యోగులకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : ఎస్సై పోస్టులకు రూ.200. హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.100 ఆన్లైన్ పేమెంట్​ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

సెలక్షన్ ప్రాసెస్ : ఎంపిక విధానం నాలుగు దశల్లో జరుగుతుంది. 1) ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) 2) రిటెన్ ఎగ్జామ్ 3) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 4) మెడికల్​ టెస్ట్​లు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ) : సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (టెలికమ్యూనికేషన్‌) పోస్టుకు సంబంధించి పురుషులు 100 మీటర్ల పరుగును 16 సెకన్లలో, 1.6 కి.మీ. రన్​ను ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తిచేయాలి. మహిళలు 100 మీటర్ల పరుగును 18 సెకన్లలో, 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల నలభైఐదు సెకన్ల వ్యవధిలో ముగించాలి.

హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ పోస్టులకు : మేల్ క్యాండిడేట్స్ 1.6 కి.మీ. పరుగును ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తిచేయాలి. 11 అడుగుల లాంగ్‌జంప్, మూడున్నర అడుగుల హైజంప్‌ లక్ష్య సాధనకు మూడు ఛాన్స్​లు ఇస్తారు. ఫిమేల్స్​ క్యాండిడేట్లు ఎనిమిది వందల మీటర్ల పరుగును నాలుగు నిమిషాల నలభైఐదు సెకన్లలో కంప్లీట్​ చేయాలి. తొమ్మిది అడుగుల లాంగ్‌ జంప్, మూడు అడుగుల హైజంప్‌ లక్ష్యాన్ని మూడు అవకాశాల్లో సాధించి తీరాలి.

  • దీంట్లో క్వాలిఫై సాధించిన వారిని ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్టుకు ఎంపిక చేస్తారు. రిటైర్డ్​ సైనికోద్యోగులకు ఈ పరీక్షను మినహాయిస్తారు.

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) : జనరల్‌ కేటగిరీ పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందినవారి హైట్, 162.5 సెం.మీ., ఛాతీ 76-81 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ. ఎస్టీ కేటగిరీకి చెందినవారు 150 సెం.మీ. ఉంటే సరిపోతుంది. వయసు, ఎత్తులకు తగ్గట్టు బరువు ఉండాలి. దీంట్లో క్వాలిఫై అయిన వారికి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.

రాత ఎగ్జామ్ : సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (టెలికమ్యూనికేషన్‌)

పోస్టుకు : ఎస్సైకు సంబంధించి పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో డిగ్రీ స్థాయిలో ప్రశ్నల నమూనా ఉంటుంది. క్వశ్చిన్​ పేపర్​ హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. టైం పీరియడ్ రెండు గంటలు. జనరల్‌ ఇంగ్లిష్‌/ జనరల్‌ హిందీ 30 ప్రశ్నలకు గానూ 30 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 35 ప్రశ్నలు - 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు - 35 మార్కులు కేటాయించబడ్డాయి.

పేపర్‌-2: గ్రాడ్యుయేషన్‌ లెవల్​లో 100 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో, ఆంగ్లం, హిందీ లాంగ్వేజ్​లో ప్రశ్నలు ఇస్తారు. దీనికి కూడా టైం పీరియడ్​ రెండు గంటలు. ఫిజిక్స్‌ (సామాన్యశాస్త్రం) 10 ప్రశ్నలు - 10 మార్కులు, కెమిస్ట్రీ సబ్జెక్ట్​కు 10 ప్రశ్నలు - 10 మార్కులు, మ్యాథ్స్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు, ఎకనామిక్స్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు, కమ్యూనికేషన్‌ 20 ప్రశ్నలు - 20 మార్కులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 10 ప్రశ్నలు - 10 మార్కులు, కంప్యూటర్‌ సైన్స్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు, ఎలక్ట్రికల్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ 10 ప్రశ్నలు - 10 మార్కులు ఉంటాయి.

హెడ్‌ కానిస్టేబుల్‌ (టెలికమ్యూనికేషన్‌) : ఎగ్జామ్​ 100 మార్కులకు ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఉంటుంది. క్వశ్చిన్ పేపర్ హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్‌ లేదా జనరల్‌ హిందీ - 20 ప్రశ్నలు - 20 మార్కులు, జీఏ (జనరల్‌ అవేర్‌నెస్‌) 15 ప్రశ్నలు - 15 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలు - 15 మార్కులు, ఫిజిక్స్‌ 20 ప్రశ్నలు - 20 మార్కులు, కెమిస్ట్రీ 10 ప్రశ్నలు - 10 మార్కులు, గణితానికి సంబంధించి 20 ప్రశ్నలు - 20 మార్కులు కేటాయిస్తారు.

కానిస్టేబుల్‌ (టెలికమ్యూనికేషన్‌) : కానిస్టేబుల్​ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రం పదవ తరగతి లెవల్​లో హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. మిగిలిన పరీక్షలు మాదిరిగానే దీనికి కూడా వ్యవధి రెండు గంటలు. జనరల్‌ ఇంగ్లిష్‌ లేదా జనరల్‌ హిందీ 20 ప్రశ్నలకు - 20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలకు - 25 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలకు - 25 మార్కులు, క్యూఏ (క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌) 30 ప్రశ్నలకు - 30 మార్కులు కేటాయిస్తారు.

  • రాతపరీక్షలో జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్​ సర్వీస్​మెన్స్​ 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (ఎన్‌సీఎల్‌) 33 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. అనంతరం డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.
  • ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్‌ ఉన్నవారికి 5 శాతం, ‘బీ’ సర్టిఫికెట్‌కు 3 శాతం, ‘ఏ’ సర్టిఫికెట్‌కు 2 శాతం మార్కులు అదనంగా జోడిస్తారు.

శాలరీ : సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (టెలికమ్యూనికేషన్‌) పోస్టుకు లెవెల్‌-6 ప్రకారం జీతం నెలకు రూ.35,400- 1,12,400. హెడ్‌-కానిస్టేబుల్‌ (టెలికమ్యూనికేషన్‌) పోస్టుకు లెవెల్‌-4 ప్రకారం నెలకు రూ.25,500- 81,100; కానిస్టేబుల్‌ (టెలి కమ్యూనికేషన్‌) పోస్టుకు లెవెల్‌-3 ప్రకారం నెలకు రూ.21,700- 69,100 ఉంటుంది.

ప్రిపరేషన్​ ఎలా?

  1. విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టులపై సరైన పట్టు సాధించాలి.
  2. జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిష్‌లో అవగాహన పెంచుకుని కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​కు సంబంధించి పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
  3. ఎగ్జామ్​ డేట్​ను ఇంకా ప్రకటించలేదు. అందువల్ల అందుబాటులో ఉన్న ఈ సమయాన్ని సన్నద్ధతకు సద్వినియోగం చేసుకోవాలి.
  4. అభ్యర్థి తాను బలహీనంగా ఉన్న అంశాలపై అదనపు టైంను వెచ్చించాలి.

అప్లికేషన్ చివరి తేదీ : 14.12.2024

ఐటీబీపీ వెబ్‌సైట్‌ : https://recruitment.itbpolice.nic.in

సెమీ కండక్టర్‌ పరిశ్రమలో భారీ ఉద్యోగ అవకాశాలు - మరి సాధించడం ఎలా?

ఇంటర్‌ అర్హత తోనే సర్కారీ కొలువులు - ఎలాగో తెలుసుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.