ETV Bharat / state

పోలవరంలో సందడి చేసిన నితిన్​, శ్రీలీల - భారీగా తరలివచ్చిన అభిమానులు

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో నితిన్, శ్రీలీల సందడి - పోలవరం, గోదావరి నది పరిసర ప్రాంతాల్లో షూటింగ్​

ROBINHOOD FILM SHOOTING
HERO NITHIN ACTRESS SREELEELA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Nithin and Sreeleela Movie Shooting : సినిమా షూటింగ్​ అంటే చాలు ఆ ప్రాంతంలోని జనాలంతా వెళ్లి చూస్తుంటే సందడి నెలకొంటుంది. అక్కడ సినిమా షూటింగ్​ అంటే ఇలా ఉంటుందా? అని ఆశ్చర్యపోతుంటారు. అలాగే నటి, నటులను చూస్తూ ఫొటోల కోసం ఎగబడుతుంటారు. ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో సినిమా చిత్రీకరణ జరిగింది. దీంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. పోశమ్మగండి వద్ద మంగళవారం (నవంబర్​ 26) రోజున సినిమా చిత్రీకరణలో భాగంగా ఆ చిత్ర బృందం కొన్ని సన్నివేశాలను షూట్​ చేసింది. హీరో నితిన్, హీరోయిన్‌ శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాలో కొంత భాగాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

కార్ల చెక్​పోస్టు సన్నివేశం : మూవీ షూటింగ్​లో భాగంగా ఆంధ్రప్రదేశ్​ టూరిజం శాఖకు చెందిన పంటుపై మూడు కార్లతో పోశమ్మగండి, పూడిపల్లి పరిసర ప్రాంతాల్లో షూటింగ్​ నిర్వహించారు. పోలవరం నుంచి గోదావరి నది ప్రవహిస్తుండటంతో తెరపై చాలా బాగా కనిపించే అవకాశం ఉంటుంది. సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశం కోసం పంటుపై ఉన్న కార్లు పంట భూముల్లో నుంచి చెక్‌ పోస్టును దాటుకుని వెళ్తున్నట్లు షూటింగ్​ తీశారు. అక్కడే ఉన్న గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వెనుక వైపున కొన్ని షాట్స్​ తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ సినిమా షూటింగ్​ జరిగిందని స్థానికులు తెలిపారు. ఇందులో భాగంగా విలన్స్​పై, కొంతమంది రైతులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.