ETV Bharat / bharat

రిజర్వేషన్ కోసం మతమార్పిడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు- 'అలా చేయడం రాజ్యాంగాన్ని మోసగించడమే'

మతమార్పిళ్లపై సుప్రీం కోర్టు ఏమందంటే?

supreme court
supreme court (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

SC on Religious Conversion : మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు మత మార్పిడికి పాల్పడడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. క్రైస్తవ మతానికి చెందిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీం కోర్టు అనుమతించదని జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్​ పేర్కొంది. ఇలా చేయడం కోటా విధానం ప్రాథమిక, సామాజిక లక్ష్యాలను బలహీనపరిచినట్లే అవుతుందని తెలిపింది. అలా చేయడం బలహీన వర్గాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల విధానాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, అది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని అభిప్రాయపడింది.

అసలేం జరిగిదంటే!
హిందూ తండ్రికి, క్రైస్తవ తల్లికి పుట్టిన సెల్వరాణి అనే ఓ మహిళ క్రైస్తవురాలిగా బాప్టిజం తీసుకుంది. ఆ తర్వాత తాను హిందువుగా ప్రకటించుకుంది. 2015లో పుదుచ్చేరిలోని అప్పర్​ డివిజన్ కర్ల్క్ పోస్ట్​కు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్​సీ సర్టిఫికెట్​ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది. తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని, అందుకే ఎస్​సీ సర్టిఫికెట్ కావాలని కోరింది. విచారణ చేపట్టిన హైకోర్టు కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించి. దీనిపై సుప్రీం కోర్టులో సవాల్ చేయగా హైకోర్టును తీర్పును సమర్థించింది.

పిటిషనర్​ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే ఉన్నారని, ఆమె తిరిగి హిందూ మతంలోకి మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ తండ్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి అయిన తర్వాత క్రిస్టియన్​గా మతం మార్పినట్లు డాక్యుమెంటరీ ఆధారాల ద్వారా స్పష్టమైనట్లు న్యాయస్థానం తెలిపింది. పిటిషన్​రకు వ్యతిరేకంగానే సాక్ష్యాలు ఉన్నాయని, కేవలం రిజర్వేషన్​ ప్రయోజనాల కోసమే మత మార్పిడి చేసుకున్నట్లుగా అర్థమవుతుందని పేర్కొంది. అందుకే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు అనుమతించమని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.