నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. ఆసుపత్రి నుంచి అంబెడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మలేరియాను అంతం చేయడమే తమ కర్తవ్యమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వన్యప్రాణుల్ని కాపాడుకుందాం...!