నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గురువారం ఘొర రోడ్డు ప్రమాదం సంభవించింది. 9వ తరగతి చదువుతున్న అరవింద్‌సాయి అనే విద్యార్థి స్కూలు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా.. ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అరవింద్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందాడు. ఫలితంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కుసుమూరు గంధ మహోత్సంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్