నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన గేట్లను ఈరోజు మధ్యాహ్నం మూసివేశారు. మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం తగ్గిపోవటం వల్ల ప్రధాన గేట్లను మూసివేశారు. కేవలం ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరి నదిలోకి 2500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా పంటలకు 5500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 90 టీఎంసీలుగా ఉంది.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య