Road Accident at Indalwai in Nizamabad District : మితిమీరిన అతివేగం నిండు ప్రాణాలను బలితీసుకుంది. సొంతవారితో పండుగ జరుపుకోవాలని హైదరాబాద్ నుంచి యూపీకి బయల్దేరిన వలస కూలీలను.. డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. తమ వారు వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నలుగురు వలస కూలీలు మృత్యువాతపడ్డారు.
Road Accident at NH44 highway Indalwai : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి(Indalwai Road Accident) వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులంతా యూపీకి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. 44వ నంబరు జాతీయ రహదారిపై.. శుక్రవారం రాత్రి వరికోత యంత్రం రోడ్డుపై ఆగిపోవడంతో భారీగా వాహనాలు నిలిచాయి. ఇదే సమయంలో యూపీవైపు వెళ్తున్న బస్సు, ఓ లారీ ఢీకొన్నాయి. బస్సులో ఉన్న వారంతా కిందికు దిగారు. అదే సమయంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం జనాల మీదకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులు ప్రదీప్, జీతు, దుర్గేష్ ప్రసాద్, గణేశ్‌గా పోలీసులు గుర్తించారు. వీరందరూ హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దసరా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
wo Persons Died in Road Accident on ORR at Hyderabad : శామీర్‌పేటలోని ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనక నుంచి ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది. ఇన్నోవా వాహనం పూర్తిగా నుజ్జునుజ్జుగా మారిపోయింది. దాంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రోడ్డు ప్రమాదం జరిగిందనే సమాచారంతో ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతులు డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజు కుత్బుల్లాపూర్ స్థానికులుగా పోలీసులు గుర్తించారు.
కీసర నుంచి మేడ్చల్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో వెళ్లి.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఓఆర్ఆర్పై వాహనాలు వేగంగా వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలుపుతున్నారు.
School Bus Accident in Mahabubnagar : స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు