ఈ నెల 28న పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లకు టీకా పంపిణీ కార్యక్రమం చేయనున్నట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. బుధవారం ఆయన కొవిడ్ వ్యాక్సినేషన్‌పై వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, సివిల్ సప్లయ్, వ్యవసాయ శాఖ రంగాల్లో ఉన్న వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తమ పరిధిలోని పీహెచ్సీలలో ఉదయం 7.00 గంటల నుంచి ఉదయం 10.00 గంటల వరకు ఆధార్ కార్డు, అక్రిడిటేషన్ కార్డు చూపించి కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పారు. కరోనా నివారణ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు హేమంత్ బొర్కడె, పి.రాంబాబు, జిల్లా వైద్యాధికారి ధన్ రాజ్, డా.అవినాశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: kcr: కరోనా విపత్కర వేళ సమ్మెకు పిలుపునివ్వడం సరికాదు: కేసీఆర్