స్వర్ణ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడే లో-లెవల్ కాజ్ వే నిర్మించి ఉండాల్సిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వంతెన లేకపోవడం వల్ల జౌలి గ్రామప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో స్వర్ణ ప్రాజెక్టు వద్ద నిర్మించిన లో-లెవల్ కాజ్వేను మంత్రి ప్రారంభించారు.
ఎన్నికల హామీ మేరకు గతేడాదిలో కాజ్ వే నిర్మాణానికి భూమి పూజ చేశామని... ఏడాదిలోనే నిర్మాణం పూర్తైందని తెలిపారు. వంతెన అందుబాటులోకి రావడం వల్ల రైతులకు, విద్యార్థులకు దూర భారం తగ్గుతుందని వివరించారు.
ఇదీ చూడండి: chada venkat reddy: సీఎం కేసీఆర్కు చాడ లేఖ