ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్నహస్తంలా ఉపయోగపడుతోందని నిర్మల్ జిల్లా సోన్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన దేశెట్టి నరేశ్.. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అతనికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.30వేల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాపాయి రాంరెడ్డి, దాసరి రఘురెడ్డి, దావ మల్లయ్య, రెంజర్ల స్వామి, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు. సారంగాపూర్ మండలం తాండ్ర గ్రామానికి సోనియా అనే మహిళ అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ విషయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమెకు సీఎం సహాయనిధి నుంచి రూ.27,500 మంజూరు చేశారు. ఆ చెక్కును కుటుంబ సభ్యులకు తెరాస నాయకులు అందజేశారు.
- ఇదీ చూడండి: ఇళ్ల సందర్శనను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంగ్రెస్