నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన కందులతో పాటు మార్కెట్కు తరలించే కందులను కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేశారు.
కందుల కొనుగోళ్లపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఎస్సై అశోక్ కుమార్, తహసీల్దార్ నాగేశ్వరరావు హామీ ఇవ్వగా... రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోతో కొన్ని గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.