ఓటుహక్కు వినియోగంపై నల్గొండలోని నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో.. ఈనాడు - ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని విద్యార్థులకు ప్రిన్సిపల్ నాగేందర్ రెడ్డి సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఓటును.. డబ్బు, మద్యం, వస్తువులకు అమ్ముకోవద్దన్నారు. సమాజానికి అవసరమైన ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈనాడు - ఈటీవీ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..!