ETV Bharat / city

గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..! - గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..!

పురపోరులో తమ నియోజకవర్గంలోని తెరాస అభ్యర్థులను గెలిపించకోకపోతే.. మంత్రులకూ పదవులు ఉండవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్​లో జరిగిన తెరాస విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. భాజపా పోటీనిస్తుందనే అపోహలు ఏమాత్రం అవసరం లేదని వారికి తెలిపారు.

గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..!

author img

By

Published : Jan 4, 2020, 8:07 PM IST

Updated : Jan 4, 2020, 10:11 PM IST

గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..!

మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేలు తేలిగ్గా తీసుకోవద్దని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్​లో తెరాస విస్తృత స్థాయి సమావేశంలో.. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు, ముఖ్య నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. తమ నియోజకవర్గంలోని అభ్యర్థులను గెలిపించుకోకపోతే... మంత్రులకు పదవులు ఉండవని సీఎం వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపులు, ప్రచార వ్యూహాల ఖరారు బాధ్యతలన్నీ స్థానిక ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.

అందరూ కలిసి సమన్వయంతో పనిచేయండి: కేసీఆర్​

టికెట్ ఎవరికి వచ్చినా అందరూ పనిచేయాల్సిందేనని తెలిపారు. ఎక్కడైనా అంతర్గత విబేధాలు కనిపిస్తే సహించేది లేదని... వాటిని సర్దుబాట్లు చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులదేనన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీలో అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు.

అతివిశ్వాసంతో వెళ్లకండి: కేసీఆర్​

మంత్రులు, ఎమ్మెల్యేలు అతి విశ్వాసంతో వెళ్లవద్దని... సంబంధం లేని విషయాల్లో తలదూర్చవద్దని చెప్పినట్లు సమాచారం. గతంలో బాబూమోహన్​ను ఎమ్మెల్యేగా చేస్తే.. ఇష్టారాజ్యంగా వ్యవహరించి నష్టపోయారని గుర్తు చేశారు.

ఆ అపోహలు మానుకోండి...

భాజపా పోటీ ఇస్తుందన్న పనికి రాని ప్రచారాన్ని, అపోహలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని పార్టీ శ్రేణులకు కేసీఆర్ చెప్పారు. అవసరమైన చోట ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రచారానికి ఆహ్వానించాలని సూచించారు.

వర్గపోరుపై అసహనం...

మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య వర్గ పోరు పట్ల సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశం అనంతరం ఇద్దరిని పిలిచి మాట్లాడారు. అందరినీ కలుపుకొని పనిచేయాలని మంత్రికి చెప్పినట్లు సమాచారం. సమావేశం అనంతరం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పలు జిల్లా నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు.

Patna (Bihar), Jan 04 (ANI): President of Lok Janshakti Party (LJP) Chirag Paswan reacted over the Citizenship Amendment Act (CAA). He said that who all are opposing the CAA are spreading chaos. They don't have full knowledge about the Act. "Our Home Minister Amit Shah has cleared that the Act is no danger to Indian citizens. But some political leaders are trying to divide the society." He made this statement as a reply to Minister of State for Home Affairs, Nityanand Rai's comment over CAA. Nityanand Rai said Saturday thaty anyone opposing the law should be declared "anti-Dalit and anti-poor."

Last Updated : Jan 4, 2020, 10:11 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.