ETV Bharat / state

ఉమ్మడి నల్గొండలో అధికార యంత్రాంగం అప్రమత్తం - కరోనా వైరస్​ వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులతో... మరోసారి కలకలం మొదలైంది. ఇప్పటికే ఏడుగురు వైరస్ బారిన పడగా... మరో ముగ్గురిలో లక్షణాలు వెలుగుచూశాయి. రెండు వారాల పాటు రహస్యంగా తలదాచుకుంటున్న బర్మా దేశానికి చెందిన ఇద్దరు రోహింగ్యాలతోపాటు... దామరచర్లకు చెందిన మహిళకు వైరస్ సోకింది. ఇక వ్యాధిగ్రస్థులకు సంబంధించి నల్గొండ జిల్లాలో 62 మందిని... సూర్యాపేటలో 33 మందిని క్వారంటైన్ కు తరలించారు.

lockdown in nalgonda district
ఉమ్మడి నల్గొండలో అధికార యంత్రాంగం అప్రమత్తం
author img

By

Published : Apr 4, 2020, 3:59 AM IST

వరుస కరోనా కేసులతో... నల్గొండ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్ వ్యక్తులు నివాసాలున్న ప్రాంతాల్ని రెడ్ జోన్లుగా ప్రకటించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏడుగురికి లక్షణాలు బయటపడగా... ఇవాళ మరో ముగ్గురు వ్యాధికి గురయ్యారు. మూడు రోజుల క్రితం జిల్లా నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించిన బర్మా దేశానికి చెందిన 14 మంది రోహింగ్యాలలో... ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. తన భర్తతో కలిసి మర్కజ్​కు వెళ్లివచ్చిన దామరచర్లకు చెందిన 55 ఏళ్ల మహిళ... వైరస్ బారిన పడింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్​లో నివాసమున్న రోహింగ్యాలు... గత కొన్ని రోజులుగా మత ప్రచారం చేస్తూ నల్గొండలోనే ఉంటున్నారు. మర్కజ్​లో జరిగిన ప్రార్థనలకు హాజరై తిరిగి... మార్చి18న నల్గొండకే చేరుకున్నారు.

రెండు వారాల పాటు రహస్యంగా గడిపిన బర్మా వాసుల్ని... గత నెల 31న గుర్తించి పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక భర్తతో కలిసి దిల్లీ వెళ్లివచ్చిన దామరచర్ల వాసిలో... వైరస్ బయటపడింది. రెండ్రోజుల క్రితం ఆమె భర్తకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రాగా... సదరు మహిళకు మాత్రం పాజిటివ్ వచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యులందర్నీ క్వారంటైన్ తరలించగా... మిర్యాలగూడ ప్రాంతంలో రెండు కేసులు వెలుగుచూసినట్లయింది.

నల్గొండ పట్టణంలోని మీర్​బాగ్​లో ఇద్దరు, బర్కత్ పుర, రహమత్ నగర్, మన్యంచెల్కకు సంబంధించి ఒక్కొక్కరు చొప్పున... మొత్తం ఐదుగురికి కరోనా సోకింది. మిర్యాలగూడ సీతారాంపురం కాలనీకి చెందిన మహిళతోపాటు సూర్యాపేట పురపాలికలోని ఒకటవ వార్డు కుడకుడలో ఇంకో వ్యక్తికి కరోనా సోకింది. ఉమ్మడి జిల్లాలో బయటపడ్డ 10 కేసులూ... దిల్లీలోని మర్కజ్​కు వెళ్లి వచ్చినవే ఉన్నాయి. ఇక ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా... జియోట్యాగింగ్ చేశారు. ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, హెల్త్ సూపర్ వైజర్​తోపాటు వంద మందితో కూడిన బృందం... వైరస్ సోకిన వీధుల్లో పరిస్థితిని అంచనా వేస్తోంది. కాలనీలకు అవసరమైన నిత్యావసరాల్ని... పురపాలిక సిబ్బందే అందిస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన కొవిడ్-19 పాజిటివ్ కేసుతో... అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఒకటవ వార్డు కుడకుడ ప్రాంతంలో... మొత్తం 7 వేల 2 వందల మందిని వైద్య సిబ్బంది పరిశీలించారు. వ్యాధి సోకిన వ్యక్తి 33 మందిని కలిశాడన్న సమాచారంతో... సదరు వ్యక్తులందర్నీ గుర్తించారు. వారిని ఇమాంపేటలోని ప్రభుత్వ క్వారంటైన్ కు పంపించారు. నల్గొండ పట్టణానికి సంబంధించిన ఐదు కేసులకు గాను 39 మందిని... మిర్యాలగూడకు సంబంధించి 13 మందిని... దామరచర్లకు సంబంధించి 10 మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

ఉమ్మడి నల్గొండలో అధికార యంత్రాంగం అప్రమత్తం

ఇవీ చూడండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.