ETV Bharat / state

రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు - coronavirus safety

రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. మర్కజ్ బృందంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 75 కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 229కి చేరింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మరణించడం వల్ల మరణాల సంఖ్య 11కు పెరిగింది. ఆస్పత్రుల నుంచి ఇప్పటి వరకు 32 మంది డిశ్చార్జ్ కాగా.. 186 మంది చికిత్స పొందుతున్నారు.

229 corona cases in telangana
రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 75 కేసులు
author img

By

Published : Apr 4, 2020, 3:30 AM IST

తెలంగాణలో కరోనా కలవరం రేపుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 229కి పెరిగింది. వ్యాధి వల్ల నిన్న మరో ఇద్దరు మరణించారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఒకరు, సికింద్రాబాద్​లో మరొకరు మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది.

కోలుకున్న 32 మంది

మరణించిన వారి కుటుంబ సభ్యులతో పాటు వారు కలిసిన వారందరినీ గుర్తిస్తున్నట్లు తెలిపింది. మరణాల సంఖ్య 11కు చేరింది. చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం మరో 15మందికి నెగెటివ్ రావడం వల్ల వారిని డిశ్చార్జ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని ఇంటికెళ్లిన వారి సంఖ్య 32కు చేరుకొంది. ప్రస్తుతం వ్యాధితో వివిధ ఆస్పత్రుల్లో 186 మంది చికిత్స పొందుతున్నారు.

మర్కజ్ వెళ్లి వచ్చిన వారు

మార్చి 28 నుంచి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. మార్చి 28న తొలి మరణం నమోదు కాగా అదే రోజు ఎనిమిది మందికి వైరస్​ సోకింది. ఇందులో దిల్లీ హజ్రత్ నిజాముద్దీన్​లోని మర్కజ్ నుంచి వచ్చిన వారు ఉండటం వల్ల అక్కడికి వెళ్లి వచ్చిన వారందరీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారి వివరాలను సేకరించి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయడం ప్రారంభించింది. మార్చి 30న ఆరు, 31న 15, ఏప్రిల్​ 1న 30, 2న 27 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గురువారం వరకు 154 మందికి వైరస్​ సోకగా శుక్రవారం నిర్ధరణ అయిన 75 తో ఆ సంఖ్య ఏకంగా 229కి చేరింది.

75 కేసులు వారివే

శుక్రవారం నిర్ధరణ అయిన 75 కేసులు పూర్తిగా మర్కజ్​కు సంబంధించినవేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి మర్కజ్​కు వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. వారితోపాటు వ్యాధి లక్షణాలున్న కుటుంబసభ్యులను ఐసోలేటెడ్ కేంద్రాలకు తరలించి పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పరీక్షలు

అందుకు అనుగుణంగా గత రెండు రోజులుగా రాష్ట్రంలో నిర్ధరణ పరీక్షలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. మొత్తం ఆరు చోట్ల ఉన్న ప్రయోగశాలల్లో 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకే శుక్రవారం ఎక్కువ కేసులు నిర్ధరణ అయినట్లు చెబుతున్నారు. ఫలితాలు రావాల్సి ఉన్నందున కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విదేశాల నుంచి వచ్చి హోంక్వారంటైన్​లో ఉన్న వారిలో ఇప్పటి వరకు 19 వేల 364 మంది గడువు ముగిసింది. ఇంకా ఏడు వేలకుపైగా క్వారంటైన్​లో ఉన్నారు. వారి గడువు ఈ నెల ఏడో తేదీతో పూర్తి కానుంది.

ఇవీచూడండి: ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.