Rajagopal Reddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి భాజపాలో చేరుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. అమిత్‌షాను కలవడం ఇది కొత్త కాదని.. అనేక సార్లు కలిసినట్లు పేర్కొన్నారు. రాజకీయంగా నన్ను దెబ్బతీసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌షాతో భేటీ కావడం అందరి సమక్షంలోనే జరిగినట్టు ఆయన వివరించారు.
కాంగ్రెస్‌తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు పత్రికల్లో, మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నానని తెలిపారు. రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఊహాగానాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేసే కుట్రకు తెరలేపారన్నారు. ఈ ప్రచారంపై కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి అయోమయానికి గురి కావద్దని రాజ్‌గోపాల్‌రెడ్డి సూచించారు. తాను పార్టీ వీడే పరిస్థితి వస్తే అందరితో భువనగిరి లోక్‌సభ, మునుగోడు నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలతో చర్చించకుండా తాను ఏ నిర్ణయం తీసుకోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: నటితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన హీరో.. రోడ్డుపైనే భార్య రచ్చ రంబోలా
కేటీఆర్ కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి.. అభిమానుల్లో నిరుత్సాహం