ఎవరైనా అటవీ సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అడిషనల్ పీసీసీఎఫ్ అధికారి ఏకే సిన్హా. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ఆయన పర్యటించారు. కొల్లాపూర్, నార్లాపూర్ గ్రామాలలో నిర్మిస్తున్న అటవీ శాఖ భవనాలను పరిశీలించారు.
సోమశిల దారిలో ఆగిపోయిన అర్బన్ పార్కు పనులను పరిశీలన చేశారు. ఆగిపోయిన పనులకు ప్రభుత్వం నుంచి వెంటనే నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ కిష్ట గౌడ్, ఎఫ్డీఓ రాజశేఖర్, కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ రవీందర్, ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు.