ETV Bharat / state

Congress Kollapur Meeting : ఖమ్మం జనగర్జనకు దీటుగా.. కొల్లాపూర్​లో కాంగ్రెస్‌ బహిరంగసభ - ఖమ్మం సభకు దీటుగా కొల్లాపూర్ సభ

Congress Kollapur Public Meeting : ఖమ్మంలో జనగర్జన సభ ఇచ్చిన జోష్‌తో... కొల్లాపూర్‌ సభకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఖమ్మం కంటే దీటుగా సభ నిర్వహించాలని... ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి జూపల్లితోపాటు పది మంది ఇతర పార్టీల నాయకులు ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు.

Congress on Kollapur Public Meeting
Congress on Kollapur Public Meeting
author img

By

Published : Jul 10, 2023, 7:08 AM IST

ఖమ్మం జనగర్జనకు దీటుగా... కొల్లాపూర్‌ బహిరంగసభకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌

Congress Public Meeting at Kollapur : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభ కోసం కాంగ్రెస్‌ కసరత్తు జోరందుకుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు పలువురు ఇతరపార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండటంతో సభను పెద్దఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా కూడా కావడంతో ఖమ్మం జనగర్జనకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండాలని పీసీసీ యోచిస్తోంది. ఐతే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగానే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు.

Priyanka Gandhi Attends Kollapur Meeting : తాజాగా మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్‌, వంశీచంద్‌ రెడ్డిల నేతృత్వంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్‌ రెడ్డి, వంశీకృష్ణ, గద్వాల్‌ జడ్పీ ఛైర్మన్‌ సరిత, ఆమె భర్త తిరుపతయ్య సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి నుంచి జనం తరలింపు, సభ నిర్వహణ, ముఖ్యనాయకుల ఏర్పాట్లు, సభాస్థలి ఎంపిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్న నేతలు వీరే : ఈ నెల 20న బహిరంగ సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్న పీసీసీ... ప్రియాంక గాంధీకి ఆహ్వానం పంపుతూ ఇప్పటికే లేఖ రాసింది. వారం రోజుల కింద లేఖ రాసినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఐతే ఈ నెల 20న కుదరకపోయినా... ఒకట్రెండు రోజులు అటు ఇటుగా పర్యటన ఖరారవుతుందన్న విశ్వాసంతో నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు, బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి సహా ఆయన కుమారుడు రాజేష్‌ రెడ్డి, గద్వాల్‌ జడ్పీ ఛైర్ పర్సన్‌ సరిత, ఆమె భర్త తిరుపతియ్యలతోపాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ మాజీ మంత్రి కూడా ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

హామీల్లేకుండానే పార్టీలో చేరండి : మరికొంత మందితో కూడా చర్చలు జరుపుతున్న కాంగ్రెస్‌ నేతలు... ఎలాంటి హామీలు లేకుండా పార్టీలో చేరాలని స్పష్టం చేస్తున్నారు. గెలిచే అవకాశం ఉంటే... బయట నుంచి వచ్చిన వారికైనా సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇందుకు సమ్మతి తెలిపిన వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా... పాతనాయకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా పీసీసీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.