మేడారంలో జంపన్న వాగు జోరుగా ప్రవహిస్తోంది. తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు మొదట జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతే దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ. జాతర రోజుల్లో ప్రశాంతంగా ఉన్న జంపన్న వాగు జాతర ముగింపు రోజు కురిసిన వర్షానికి వరదనీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు వేగంగా ప్రవహిస్తున్నా... అధికారులు ఎలాంటి సూచనలు చేయకపోవడంతో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు.
ఇవీ చూడండి: మేడారం జాతరలో కృత్రిమ మేధ సఫలీకృతం