మేడారం జాతరలో.. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పోలీసులు కృత్రిమ మేధ వినియోగించారు. ఈ విధానంలో భాగంగా జాతర జరిగే కీలక ప్రాంతాల్లో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 15 ఆర్టిఫిషియల్ హైడెఫినేషన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జంపన్నవాగు నుంచి గద్దెల వద్దకు వెళ్లే మార్గాలు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం, ఊరట్టం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించారు. అక్కడి నుంచి భక్తుల సంఖ్యను అంచనా వేస్తూ రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టారు.
కొత్తగా ఎవరొచ్చినా గుర్తిస్తుంది..
మేడారం పరిసరాల్లో 26 కిలోమీటర్ల మేర కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఒక్క భక్తుడు కొత్తగా వచ్చినా గుర్తించగల నైపుణ్యం వీటి సొంతం. వృద్ధులు, పిల్లలు, మహిళలు, పురుషుల సంఖ్య ఎంత అనే అంశాలను ముఖ కవలికలను బట్టి లెక్కిస్తాయి. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ పరిజ్ఞానం ఆధారంగా ఎన్ని వాహనాలు వచ్చాయని గుర్తించడమే కాకుండా అవి ఏ రకమో కూడా గర్తించగలగడం వీటి విశేషం. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఐటీ విభాగం నిపుణులు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హాజరయ్యే ప్రయాగరాజ్ కుంభమేళాని ఆరునెలల పాటు అధ్యయనం చేశారు.
ఇకనుంచి అన్నింట్లో వాడే ఆలోచన
కృత్రిమ మేథ విధానం అమలు మేడారంలో సఫలమయినందున ఇక నుంచి భారీ ఊరేగింపులు, సభలు, సమావేశాల్లో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానమే వినియోగించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: అత్యాచార ఉచ్చుల్లో అకృత్యాలెన్నెన్నో!