అసెంబ్లీ సమావేశాలను ప్రజల సమస్యలు కోసం కాకుండా ప్రమాణస్వీకారం, బిల్లుల కోసం అన్నట్లే నడిపిస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టం జరిగిందని... రైతులకు భరోసా ఇచ్చే విధంగా సీఎం వ్యవహారించడం లేదని ఆమె ఆరోపించారు.
వర్షం వల్ల నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళా కమిషన్ లేదని... మహిళలపై దాడులు జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదన్నారు.
మంత్రి కేటీఆర్... సభలో సంబంధంలేని విషయాలను తెచ్చి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో చినుకుపడితే ప్రాణాలను హరించడానికి మోర్లు నోర్లు తెరిచి చూస్తున్నాయన్నారు.
ఇదీ చూడండి: వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షాలు