కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని ఫెస్టివ్ ఫోక్స్ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ (సమస్త) ఛైర్పర్సన్ ఉమ ఎడ్లపాటి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థలోని 29వ వార్డులో సమస్త ఆధ్వర్యంలో సుమారు 300 మంది నిరుపేదలకు వారం రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
లాక్డౌన్ ప్రారంభం నుంచి ప్రతి రోజు వలస కార్మికులకు తమ వంతు సహాయం చేస్తున్నామని ఉమ తెలిపారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆమె కోరారు. ఒకవేళ అత్యవసరమై బయటకు వస్తే మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.