మేడ్చల్ జిల్లా దుండిగల్లో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. సురారం కాలనీ నివాసి కస్థల వెంకటరమణ కుమార్తె కస్థల రమ్య చింతల్ లోని భాగ్యరథి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
శనివారం ఉదయం ఫలితాలు చూసుకునేందుకు కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన విద్యార్థిని...మళ్లీ తిరిగి ఇళ్లు చేరలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : 'నా భార్యను ఆ నరకం నుంచి భారత్కు రప్పించండి'