లోక్సభ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన సందర్భంగా పార్టీ శ్రేణులు మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మెదక్ జిల్లా హావేలి ఘనపురం మండల కేంద్రంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భాజపా చేపట్టిన అనేక సంక్షేమ పథకాల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలంగాణలో సారు..కారు..సర్కారు అని పలికి దిల్లీలో చక్రం తిప్పుతామన్న కేసీఆర్ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి : రాజకీయాల్లో అహంకారం పనికిరాదు: ఉత్తమ్