శ్వాస పరీక్షల యంత్రం తప్పుడు ఫలితాలతో అన్యాయం జరుగుతోందని మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. శ్వాస విశ్లేషణ తప్పుడు ఫలితాలతో ఇప్పటి వరకు 81 మంది సిబ్బంది సస్పెండ్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రెండు గంటలపాటు డిపో ఎదుట ధర్నా చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న సిబ్బందితో చర్చించారు. శ్వాస పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసి యంత్రాలను పరిశీలన కోసం పంపిస్తున్నట్లు ఇంఛార్జి డీఎం వెంకటకృష్ణ తెలిపారు. అధికారుల హామీతో కార్మికులు ధర్నా విరమించారు.
ఇవీచూడండి: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్