ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 18 నుంచి 25 వరకు మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నలుగురు అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి నరేశ్జాదవ్ సహా, భారతీయ బహుజన క్రాంతీదళ్ అభ్యర్థి ఆడె బాలాజీ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు.
ప్రధాన పార్టీలైన తెరాస తరఫున సిట్టింగ్ ఎంపీ గోడం నగేశ్, కాంగ్రెస్ నుంచి రమేష్ రాఠోడ్, భాజపా నుంచి సోయం బాపురావుతో పాటు ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో తొలిసారిగా జనసేన తరపున జేఎన్‌టీయూ విద్యార్థి దారవత్ నరేందర్ పోటీ పడుతున్నారు. బరిలో ఉన్న 11 మందిలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులే. నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసినందున, ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టడం వల్ల రాజకీయంవేడెక్కుతోంది.
ఇవీ చూడండి:ఒకరికి ఒకరు తోడుగా...ప్రచారంలో అండగా